అరెస్టయిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా భారత్‌కు అప్పగించాలని కోరుతామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదిని భారత్‌కు అప్పగిస్తారా? అని కెనడా విదేశాంగ మంత్రిని మెలోనీ జాలీని ప్రశ్నించగా, ఈ విషయం తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా భారత్‌లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇటీవల అతన్ని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, దల్లాను భారత్‌కు అప్పగించాలని కోరుతామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మెలోనీ జాలీని భారత్ డిమాండ్‌పై ప్రశ్నించగా, ఈ విషయం ఇంకా విచరణలోనే ఉందని, దానిపై ఇప్పుడు ఏమీ చెప్పలేనన్నారు. భారత దౌత్యవేత్తల నుంచి ఏదైనా సమాచారం కోరితే వారితో మాట్లాడుతామని, అప్పగింత విజ్ఞప్తిపై నిర్దిష్ట సమాచారం లేదన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ స్థాయిలో చర్చలు కొనసాగిస్తామన్నారు.