విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మించారు. వరంగల్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ నేను సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడిన వీడియోలను కట్ చేసి, వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ కొందరు వ్యక్తులు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. సోషల్‌మీడియా వేదికల్లో నన్ను ట్రోల్ చేసేవారి గురించి అస్సలు పట్టించుకోను. ట్రోలర్స్ నన్ను ఏమీ చేయలేరు. నా సినిమాల గురించి ఎవరు ఎలా విశ్లేషించినా ఫర్వాలేదు.
అది వాళ్లకున్న స్వేచ్ఛ అనుకుంటా. కానీ నన్ను పర్సనల్‌గా అటాక్ చేస్తే మాత్రం ఊరుకోను. హిట్టయినా, ఫ్లాపయినా సినిమాలు చేస్తూనే ఉంటా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో మెకానిక్ రాకీ విభిన్నంగా నిలు స్తుంది. 21వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ విశ్వక్‌సేన్ చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.