ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమెనికా దేశాలు తమ అత్యున్న త పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి. గయానా పర్యటనలో ఉన్న మోదీ ఈ రెండు పురస్కారాలను అందుకున్నారు. ముందుగా డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమెనికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో మోదీని సత్కరించారు. కొవిడ్ సమయంలో తమ దేశానికి మోదీ అందించిన సహాయ సహకారాలకు గానూ ఈ అవార్డును అందించారు. అదేవిధంగా గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ తెలియజేశారు.