ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. వీటితో కలిపితే అమెరికా ఇచ్చే మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భాగంగా జరగనున్న వర్చువల్ సమావేశంలో బైడెన్ ప్రకటన చేయనున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకల్లా అన్ని దేశాలు 70 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా బైడెన్ కోరనున్నారు. ఈ వ్యాక్సిన్లు విరాళమే అని, వీటికి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని బైడెన్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.