అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో ప్రమాణం స్వీకారం చేయను న్నారు. ఈనేపథ్యంలో తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తన పరిపాలన టీమ్‌లోకి ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా తన సన్నిహితుడు కాష్ పటేల్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాట యోధుడు అని ట్రంప్ ప్రశంసించారు. 44 ఏండ్ల పటేల్ 20 17లో ట్రంప్ హయాంలో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు.