తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు అచ్చమైన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచి అమెరికా తెలుగు వైభవాన్ని చాటారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి దాదాపు 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్‌గా నిలిచి కిరీటం అందుకున్నారు.
ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా ఆమె సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగే ట్రం చేసి అందరినీ ఆకట్టుకున్న హన్సిక ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ ఇప్పటికి నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ. మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు.