
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, వేలాదిమంది జనం మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణం చేశారు. గురువారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఫడణవీ్‌సతో ప్రమాణం చేయించారు. అనంతరం, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే (60), అజిత్‌పవార్ (65) ప్రమాణం చేశారు. శిందే ప్రమాణం చేయటానికి ముందు.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేలకు కృతజ్ఞతలు తెలుపుతూ కొద్దిసేపు ఉపన్యసించారు. గవర్నర్ ప్రమాణం చేయించడానికి ఉద్యుక్తులవటంతో, ప్రసంగాన్ని ఆపి ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణంతో రెండు వారాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
