అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన తెలుగు విద్యార్థిని మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. టెనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారి వాహనం, మరో వాహనం ఢీకొనడంతో భారత్‌కు చెందిన 26 ఏండ్ల నాగ శ్రీ వందన పరిమళ గాయపడింది. ఆమెను దవాఖానలో చేర్చగా అక్కడ మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్‌లో ఎంఎస్ చేస్తున్నది. గాయపడిన పవన్, నిఖిత్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు వాహనాల్లో ఒకటి వేగాన్ని నియంత్రించుకోలేక మరో వాహనాన్ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.