Namaste NRI

విశ్వ‌క్ సేన్ లైలా నుంచి ఇచ్చుకుందాం బేబీ

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైలా. ఆకాంక్షశర్మ కథానాయిక.  రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం . ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు.ఈ సినిమాలోని ఇచ్చుకుందాం బేబీ అనే పాటను లాంచ్‌ చేశారు. లియోన్‌ జేమ్స్‌ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు. ఆదిత్య ఆర్కే, మానసి ఆలపించారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా విష్‌లిస్ట్‌లో ఉన్న సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే సినిమా చేస్తున్నాం అని చెప్పా. వాలెంటైన్‌ డే రోజు బ్యాచిలర్స్‌ అందరూ తమకు ఎవరూ తోడు లేరని బాధపడుతుంటారు. కానీ ఈ ప్రేమికుల రోజున మీకు లైలా తోడుంటుంది అన్నారు.

ఈ సినిమాలో లైలా పాత్ర కోసం మేకప్‌కే రెండు గంటలు పట్టేదని, ఓసారి షూటింగ్‌ లొకేషన్‌ నుంచి లైలా గెటప్‌లో తన నాన్నకు వీడియో కాల్‌ చేస్తే ఆయన గుర్తుపట్టలేదని  అన్నారు. ఈ కథను కొందరు హీరోలకు చెబితే..లేడీ గెటప్‌ వేయాల్సిరావడం వల్ల ఒప్పుకోలేదని, విశ్వక్‌సేన్‌ వల్లే ఈ పాత్రను తెరకెక్కించగలిగానని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌సేన్‌ కెరీర్‌లో నిలిచిపోయే పాత్ర ఇదని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events