మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. అమెరికాకు వచ్చి మీ ఉత్పత్తులను తయారు చేసుకోండి. ఈ భూమి మీద ఏ దేశంలోనూ లేనంత తక్కువ పన్నులు మేం విధిస్తాం. ఒకవేళ మీరు అమెరికాలో ఉత్పత్తులు తయారు చేయకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సిందే అని ట్రంప్ స్పష్టం చేశారు.