ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల పునరేకీరణకు అమెరికానే ప్రధాన అడ్డంకి అని ఉత్తర కొరియా విమర్శించింది. తమ పట్ల అమెరికా శత్రుపూరిత వైఖరిని వీడనంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదని ఐక్యరాజ్య సమితిలో ఉత్తర కొరియా శాశ్వత ప్రతినిధి కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా అనుసరిస్తూ ఈ వైఖరి వల్ల కొరియా ద్వీపకల్పంలోని ప్రజలు తమకు ఇష్టం లేకున్నా రెండు దేశాలుగా విడిపోయి ఉండాల్సి వస్తోంది. అణు పరీక్షలు నిర్వహించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అనుకుంటే పొరపాటు. ఉత్తర కొరియా ఏర్పడిన మరు క్షణం అమెరికా మా అసౌర్వభౌమతాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తోది. మమ్మల్ని శత్రు రాజ్యంగా పరిగణిస్తోంది. మా ప్రజలు ఎంచుకున్న సోషలిస్టు వ్వవస్థ పట్ల బాహాటంగా శత్రుపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-4-300x160.jpg)