అమెరికన్ సంస్థ యాక్సియమ్ త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా ఎంపికైనట్టు నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వసంత కాలంలో (మే-జూన్) ఈ యాత్ర మొదలవుతుంది.
దీనిలో భాగంగా స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. పైలట్గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఓ వెబినార్ లో తెలిపారు.