మంచు విష్ణు టైటిల్ రోల్ని పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం. మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా శివా శివా శంకరా అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బెంగళూరులో ఈ గీతాన్ని విడుదల చేశారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. విజయ్ప్రకాష్ ఆలపించారు. ఈ పాటను పండిట్ రవిశంకర్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, ఇదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభవమని మోహన్బాబు పేర్కొన్నారు. కన్నప్ప చిత్రంలో రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్ కనిపించనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
