ఈ ఏడాది(2025) హజ్ యాత్రకు సంబంధించి కీలకమైన కొన్ని మార్పులను సౌదీ అరేబియా ప్రకటించింది. హజ్ యాత్రలో పిల్లల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. హజ్ యాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో యాత్రికుల రాకను దృష్టిలో ఉంచుకుని పిల్లల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాజీ మంత్రిత్వశాఖ, ఉమ్రా ప్రకటించాయి. అంతేగాక, ఈ ఏడాది హజ్ యాత్రలో మొదటిసారి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని సౌదీ అధికారులు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/america-300x160.jpg)