అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ బీ నూతన డైరెక్టర్ గా మొట్టమొదటిసారి భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికన్ సెనేట్ నుంచి ఆమోదం లభించింది. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. తన నియామకానికి సెనేట్ ధ్రువీకరణ లభించిన సందర్భంగా కాష్ పటేల్ స్పందిస్తూ ఎఫ్ బీ ఐ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఎఫ్ బీ 9వ డైరెక్టర్ గా తనను నియమించినందుకు అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బాండీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్లకు హాని తలపెట్టాలని భావించే వారిని వేటాడతానని ఆయన హెచ్చరించారు.
