
చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసిర్రు గానీ, గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. నాని హీరోగా ది ప్యారడైజ్ అనే చిత్రం రూపొందుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇందులో నాని లుక్, మేకింగ్ అనేది భారీ అంచనాలు పెంచుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని లుక్ ఉంది. కాకికి నాని తలను తగిలించి పోస్టర్ రిలీజ్ చేసారు. శ్రీకాంత్ ఓదెల కచ్చితంగా ఏదో డిఫరెంట్ కథను చూపించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమా హిట్టయితే టాలీవుడ్ లో కాకి సెంటిమెంట్ ఇంకా బలపడుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాకోసం నాని మేకోవర్ అదిరిపోయింది. తిరుగుబాటు ప్రపంచంలో నాయకుడి ప్రయాణాన్ని చూపించిందీ గ్లింప్స్. వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె.విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి.
