
రోషన్ కనకాల కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మోగ్లీ 2025. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయిక. సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో 20రోజుల పాటు క్రూషియల్ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలిపారు. ఇందులో రోషన్ కనకాల వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారని, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథ ఇదని వారు చెబుతున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం. సంగీతం: కాలభైరవ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
