Namaste NRI

విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం : కంచరకుంట్ల వంశీరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఫౌండర్‌ కంచరకుంట్ల వంశి రెడ్డి అన్నారు. హనుమ కొండలష్కర్‌ బజార్‌ లోని మార్కజి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవ సందర్భంగా వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాలకు సైన్స్‌ ల్యాబ్‌ పరికరాలను అందజేశారు. అనంతరం వంశి రెడ్డి మాట్లాడుతూ మా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా సైన్స్‌ ల్యాబ్‌ ను అందజేసినట్లు చెప్పారు. అనంతరం వంశి రెడ్డిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో సందీప్‌, మాట దత్తత గ్రామాల డైరెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, క్వాటర్‌ డైరెక్టర్‌ జి.శ్రీధర్‌ రెడ్డి, డైరెక్టర్‌ పల్లం శీలమ్‌, ప్రధానోపాధ్యాయులు జీవీ రామారావు, విద్యాసాగర్‌ రెడ్డి, మురళీధర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు రమాదేవి, కిరణ్‌ వల్సపైడి, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events