
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. కెనడా, చైనా, మెక్సికో దేశాలపై భారీగా సుంకాలను విధించారు. పెంచిన సుంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏంటి? అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం అని వారెన్ బఫెట్ అన్నారు.
