
భారత ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం అందుకోనున్న భారతీయులలో మోదీ మొదటి వారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌కు చేరిన మోదీకి, ప్రధాని రామ్‌గోలం ఘన స్వాగతం పలికారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో మోదీ భేటీ అయ్యారు. గోకుల్, ఆయన సతీమణి వృంద గోకుల్‌కు కుంభమేళా పవిత్ర గంగాజలాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. బీహార్‌కు చెందిన ఆహార పదార్థం మఖానాను అధ్యక్షునికి, బెనారస్ సిల్క్ చీరను ఆయన సతీమణికి బహూకరించారు. అలాగే రామ్‌గోలం, ఆయన సతీమణి వీణా రామ్‌గోలంకు ప్రధాని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను అందజేశారు.
