
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఈ నెల 30న నా పుట్టినరోజు. సినిమా 28వ తేదీన వస్తున్నది. ఈ సినిమాతో దర్శకుడు వెంకీ నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని అన్నారు. భీష్మ కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని, అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారని, ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో ఆకట్టుకుంటుందని చెప్పారు.

తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, చక్కటి వినోదంతో ఉన్నత నిర్మాణ విలువలతో మెప్పిస్తుందని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు. సినిమాలో తాను మీరా అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, అందరిని నవ్విస్తానని కథానాయిక శ్రీలీల చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
