Namaste NRI

ప్రపంచవ్యాప్తంగా బాయ్ కాట్  అమెరికా ఉద్యమం

కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు వాణిజ్య యుద్ధాలకు నాంది పలకడంతోపాటు అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా బాయ్‌కాట్‌ అమెరికా  పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉద్యమానికి దారితీశాయి. గడచిన వారం రోజులుగా బాయ్‌కాట్‌ అమెరికా  గూగుల్‌లో ట్రెండింగ్‌ అవుతున్నది. అంతేగాక, అమెరికా వస్తువుల బహిష్కరణ కోసం అనేక దేశాలు ఫేస్‌బుక్‌ గ్రూపులను నిర్వహిస్తున్నాయి.

డెన్మార్క్‌కు చెందిన పాక్షిక స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్‌ ప్రయత్నాలు కూడా ఈ వ్యతిరేకతకు ఒక కారణంగా చెప్పవచ్చు. డెన్మార్క్‌కు చెందిన ఫేస్‌బుక్‌ గ్రూపులో దాదాపు 73,000 మంది సభ్యులు ఉండగా లగ్జెంబర్గ్‌ తర్వాత అత్యధిక సెర్చ్‌లు ఈ పేజీకే ఉన్నాయి. గూగుల్‌లో బాయ్‌కాట్‌ అమెరికా కోసం అత్యధికంగా సెర్చ్‌లు జరుగుతున్న దేశాలలో స్వీడన్‌ నాలుగవ స్థానంలో ఉంది.

అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అత్యుత్తమ సాధనంగా ఫేస్‌బుక్‌ పేజ్‌ ఉపయోగపడుతోంది. బాయ్‌కాట్‌ అమెరికా బై ఫ్రెంచ్‌ అండ్‌ యూరోపియన్‌ పేరిట ఫ్రాన్స్‌ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌ పేజీ 20,000 మంది సభ్యులతో గూగుల్‌ సెర్చెస్‌లో 3వ స్థానంలో ఉంది. కెనడా ఇప్పుడు బాయ్‌కాట్‌ అమెరికా ప్రచారంలో ముందు వరుసలో ఉంది. గూగుల్‌ సెర్చెస్‌లో 5వ స్థానంలో నిలిచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events