
సప్తగిరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెళ్లికాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్ హౌజ్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నది. థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. 36ఏళ్లు దాటిన ప్రసాద్ పెళ్లి గురించి టెన్షన్ పడుతుంటాడు. ఏజ్బార్ అయినప్పటికీ పెళ్లికి ఇబ్బంది కాదని తండ్రి అతనికి ధైర్యాన్నిస్తుంటాడు. మరింత ఆలస్యం జరిగితే ఇక పెళ్లికి అవకాశం ఉండదేమోనని ప్రసాద్ భయం. మరోవైపు తమ కుటుంబాన్ని మొత్తం పోషించే వరుడి కోసం అన్వేషిస్తుంటుంది హీరోయిన్ ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో హిలేరియస్ ఎంటర్టైనర్ ఇదని చిత్రబృందం చెప్పింది. పెళ్లికాని ప్రసాద్ పాత్రలో సప్తగిరి తనదైన హాస్యంతో ఆకట్టుకున్నాడు. ప్రియాంకశర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ నెల 21న విడుదలకానుంది.ఈ చిత్రానికి సంగీతం: శేఖర్చంద్ర, నిర్మాణ సంస్థ: థామ మీడియా, విజన్ గ్రూప్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి.
