
మధ్య, దక్షిణ అమెరికాలలో పెను తుఫానులు, కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇండ్లు, పాఠశాలలకు తీవ్ర నష్టం జరిగింది. వివిధ రాష్ర్టాల్లో మొత్తంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మిస్సోరీలో శుక్రవారం రాత్రి కనీసం 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మిసిసిప్పిలో ఆరుగురు మరణించినట్లు గవర్నర్ టటే రీవ్స్ తెలిపారు.

అలబామాలో ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. అర్కాన్సాస్‌లో ముగ్గురు మరణించారు. గవర్నర్ సారా హుక్కబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జార్జియా గవర్నర్ కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. పొడిగా ఉండే ప్రాంతాల్లో కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో 130 అగ్ని ప్రమాద ఘటనలు జరిగినట్లు సమాచారం.
