Namaste NRI

ఈ సినిమా 20ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది

కల్యాణ్రామ్ కథానాయకుడిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ చిత్రం  టీజర్ను విడుదల చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులను ఎదుర్కొనే సన్నివేశాలతో టీజర్ ఆరంభమైంది. వైజాగ్లో నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవడంతో అర్జున్ రంగ ప్రవేశం చేస్తాడు. ఈ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ యాక్షన్ ఘట్టాల్లో భాగమయ్యే అవకాశం దక్కిందని, ఆ సన్నివేశాలన్నీ సహజంగా అనిపిస్తాయని, తన అభిమానులకు ఫుల్మీల్స్లాంటి సినిమా ఇదని విజయశాంతి చెప్పారు.

కల్యాణ్రామ్ మాట్లాడుతూ కర్తవ్యం సినిమాలో వైజయంతికి కొడుకు పుడితే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్నదే ఈ సినిమా కథ. నా కెరీర్లో అతనొక్కడే  సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అదే తరహాలో ఈ సినిమా కూడా 20ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. స్త్రీమూర్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వారి కోసం మనం ఎలాంటి త్యాగం చేసినా సరిపోదనే సందేశంతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది  అన్నారు. విజయశాంతిగారు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేద్దామనుకున్నామని, ఆమె అంగీకారంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లిందని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెలిపారు. ఈ సినిమాకు విజయశాంతిగారు ఆయువుపట్టులా నిలిచారని నిర్మాత సునీల్ బలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాథ్, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]