Namaste NRI

ఈ నెల 21న కాలమేగా కరిగింది  

విజయ్‌కుమార్‌, శ్రావణి మజ్జరి, అరవింద్‌ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన పొయెటిక్‌ ప్రేమకథ కాలమేగా కరిగింది. శింగర మోహన్‌ దర్శకుడు. మరే శివశంకర్‌ నిర్మాత. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్‌ విడుదల చేశారు. దరి దాటిన మోహం దేహమే కదా, ఎదుటే నిలిచేనూ, ఆ యదపై తాకెను,  చెలి వీడినా మౌనం, మర్మమే కదా.. కథలై కదిలెనూ, ఆ కబురై పాకేనూ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు శింగర మోహన్‌ రాయగా, గుడప్పన్‌ స్వరపరిచారు. సాయిమాధవ్‌, ఐశ్వర్య దదూరి ఆలపించారు. యువతరం మెచ్చే ప్రేమకథ ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వినీత్‌ పబ్బతి, నిర్మాణం: సింగార క్రియేషన్స్‌ వర్క్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]