మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలను వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్`ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా ఘనంగా జరిగాయి. జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీకి మహాత్మా గాంధీ వంశీ` శుభోదయం అవార్డు 2021ని బహుకరించారు. ఈ అవార్డు ప్రదానం మాచర్లలోని వారి స్వగృహంలో ఆమె కుమారులు జి.వి.ఎన్. నరసింహం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించారు. వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, లయన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో 5 ఖండాల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని జాతిపితకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రముఖనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ జమున రమణారావు గాంధీ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ నేటి యువతకు మహాత్ముని సేవల్ని గుర్తు చేయాలని అన్నారు. ప్రముఖ నటి డా. జమున రమణారావు మాట్లాడుతూ తన చిన్నతనంలో గాంధీజీని చూశానని, అప్పటి విశేషలు పంచుకున్నారు.