అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కవ్వింపులకు తాము భయపడబోమని, తాము వెనుకడుగు వేయబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. మేము చైనీయులం. కవ్వింపులకు మేము బెదరం. మేము వెనక్కు తగ్గం అని నింగ్ స్పష్టంచేశారు.ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో నిర్ణయించేది మేం కాదు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఫిసెన్‌హోవర్ లేదా తదుపరి అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడి ఉంటుంది. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగినా మేం మాత్రం లొంగేది లేదు. సంపూర్ణ విజయం దక్కే వరకు పోరాడుతాం అని మావో పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను 34 శాతం నుంచి 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా వస్తువులపై అమెరికా సుంకాలను 145 శాతం పెంచింది.
