Namaste NRI

సింగపూర్‌ పార్లమెంట్​ ఎన్నికల్లో పీఏపీ ఘన విజయం .. మరోసారి ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌

సింగపూర్‌ ఎన్నికల్లో అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) ఘన విజయం సాధించింది. ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ నేతృత్వంలోని ఈ పార్టీ మొత్తం 97 పార్లమెంటు స్థానాలకు గాను రికార్డు స్థాయిలో 87చోట్ల గెలుపొందింది. మొత్తం 26లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగపుర్ పార్లమెంటులో మొత్తం 98 సీట్లుండగా 5 చోట్ల ఇప్పటికే పీఏపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికలు జరిగిన 93 సీట్లలో 82 చోట్ల ఆ పార్టీ విజయం సాధించి మొత్తం 87సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్ష వర్కర్స్‌ పార్టీ 10 సీట్లలో గెలిచింది. 66 ఏళ్లుగా సింగపూర్‌లో పీఏపీనే అధికారంలో కొనసాగుతోంది.

Social Share Spread Message

Latest News