హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్, రాంనగర్, సికింద్రాబాద్, ముషిరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, చంపాపేట, సైదాబాద్ పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడిరది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొదని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 040`2111 1111కు సంప్రదించాలని తెలిపారు.