టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా అవతరించారు. రుమేసా 7.07 ఫీట్ల (215.16 సె.మీ) పొడవుంది. ప్రపంచంలోనే అత్యంత పొడగరైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్ సిండ్రోమ్ అని వైద్య నిపుణులు వెల్లడిరచారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్ చైర్ లేదా వాకింగ్ ప్రేమ్ సాయంతో నడుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)