చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రం తమసోమా జ్యోతిర్గమయా. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా మంచి క్రేజ్ ఏర్పడిరది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చిత్ర టైలర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ చాలా మంచి కథ ఇది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాల్లోనే చిత్రీకరణ జరుపుకొంది. 2001`14 మధ్య కాంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని ఈ సినిమాలో చూపించనున్నాం అన్నారు. కథను నమ్మి సినిమా చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు హీరో ఆనంద్ రాజ్. నిర్మాత మాట్లాడుతూ చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారి కథతో ఈ సినిమా తెరకెక్కించాం. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వాళ్లు మారగలిగితే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాం అన్నారు. తడక రమేష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ కార్యక్రమంలో శ్రావణి శెట్టి, సహా నిర్మాత సాయి కార్తీక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)