ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారైల శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వానికి ఎన్నారైల తరపున మద్దతు ఇస్తామన్నారు. ఈ నెల 17 భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 9 గంటలకు ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియా కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారని తెలిపారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించాలని ఎన్నారైల తరపున ప్రచారాన్ని చేస్తున్నామని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)