తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మకు మహిళలు పూజలు చేశారు. బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. మహాలయ అమావాస్య నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, తొమ్మిది రోజులు, నైవేద్యాలు, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని మహిళలు పూజించగా, చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు ముగిశాయి పోయిరా బతుకమ్మ ఉయ్యాలో మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ఆ గౌరమ్మ తల్లికి ఘనంగా వీడ్కోలు పలికారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదురకాల నైవేద్యాలు తయారు చేసే గౌరమ్మకు వైవేద్యాన్ని సమర్పించారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మను చెరువులో నిమజ్ఞనం చేయడంతో ఈ వేడుకలు ముగిశాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)