టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నేటి నుంచి షురూ కానున్నది. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 (ఆదివారం) నుంచి నవంబర్ 14 వరకు జరగనున్నది. ఆదివారం ఆరంభ మ్యాచ్‌లో ఒమన్, పాపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటల నుంచి జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫార్మాట్ చూస్తే మొత్తం 16 జట్లతో టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలుత 8 చిన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్`ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియా, గ్రూప్ బిలో బంగ్లాదేశ్, ఒమన్, స్కాట్లాండ్, పావువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. ఈ దశ అనంతరం సూపర్ `12 దశ ఉంటుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి నుంచి మెరుగైన ఫలితాలు సాధించిన 4 జట్లు ఈ సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి.
భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వెస్టిండీస్ వంటి జట్లు నేరుగా సూపర్ 12 దశ నుంచి ఈ టోర్నీలో తమ ప్రస్థానం ఆరంభిస్తాయి. సూపర్ 12 దశలో గ్రూప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా, గ్రూప్`ఏలో తొలి స్థానం సాధించిన జట్టు గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కూడా పోటీ పడతాయి.