Namaste NRI

అంతరిక్షంలో సినిమా షూటింగ్

గత కొన్నేళ్లుగా అంతరిక్ష యాత్రలో ప్రపంచ దేశాలు దూసుకెళ్తున్న విషయం తెలిసింది. ప్రైవేటులోనూ అంతరిక్ష పర్యాటకం వేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ నేపథ్యంలో కేవలం యాత్రలే కాదు తాజాగా అక్కడ సినిమా షూటింగ్‌లు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్‌ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్‌ నోవిట్‌స్కీ, యులియా పెరెసిల్డ్‌, క్లిమ్‌ షిపెంకోలతో కూడిన సోయుజ్‌ అంతరిక్ష నౌక కజఖ్‌స్తాన్‌లోని మైదాన్‌ ప్రాంతంలో దిగింది. ఆ వెంటనే యులియా, నోటిట్‌స్కిలు, సీట్లలో ఉండగానే 10 నిమిషాలపాటు సినిమాలోని కొన్ని దృశ్యానలు చిత్రీకరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ ముగ్గురూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

                దర్శకుడు షిపెంకో చాలెంజ్‌ అనే సినిమా చిత్రీకరణ కోసం నటి యులియాతో కలిసి ఈ నెల 5వ తేదీన అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న విషయం తెలిసిందే. సర్జన్‌ పాత్ర పోషిస్తున్న యులియా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ వ్యోమగామికి అత్యవసర చికిత్స చేసే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనారోగ్యంగ బారిన పడిన వ్యోమగామి పాత్రను ఇప్పటికే 6 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నోవిట్‌స్కీ పోషిస్తున్నారు.   చిత్రీకరణ పూర్తి చేసుకున్న  తర్వాత ఆ ముగ్గురు వ్యోమగాములు షెడ్యూల్‌ ప్రకారం నేడు అక్టోబర్‌ 17 భూమికి చేరుకున్నారు. ఈ పర్యటన విజయవంతమైనట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) వెల్లడిరచింది. దీంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి  దేశంగానూ రష్యా నిలిచింది. సినిమా షూటింగ్‌ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్‌ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events