Namaste NRI

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. విజయ్‌ సేతుపతి, సంయుక్త మీనన్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను భారీ సెట్‌లో పూరీ చిత్రీకరిస్తున్నారు.

ఎలాంటి బ్రేక్స్‌ లేకుండా శరవేగంగా షూటింగ్‌ సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకు భవతీ భిక్షాందేహీ అనే టైటిల్‌ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. పానిండియా ఎంటైర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టబు, విజయ్‌కుమార్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి నిర్మాతలు: పూరీ జగన్నాథ్‌, జెబి నారాయణరావు కొండ్రోళ్ల, సమర్పణ: ఛార్మీ కౌర్‌, నిర్మాణం: పూరీ కనెక్ట్స్‌, జెబీ మోహన్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News