Namaste NRI

నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్‌ చేసిన మరో దేశాధినేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్‌ పేరును 2026 నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహూ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్‌లో డిన్నర్‌ చేశారు. ఈ సందర్భంగా తాను అమెరికా అధ్యక్షుడి పేరును ప్రతిపాదిస్తూ నోబెల్‌కు పీస్‌ కమిటీకి లేఖ రాశానని చెప్పారు. తప్పనిసరిగా ఆయనకే ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కుతుందని తెలిపారు. మనం మాట్లాడుతుండగానే ఆయన ఒక దేశంలో, ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతారంటూ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో భేటీలో గాజాతో కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చించారు. 

Social Share Spread Message

Latest News