పొరుగు దేశం చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న చైనా బ్రాండ్ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ప్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మ్ట్ాంఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను భారత్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు, ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాలను సైతం వెల్లడిరచాల్సిందేనని నోటీసుల్లో భారత్ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడిరచాల్సి ఉంటుంది. ఇందత నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)