భారత్ టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (49:4 ఫోర్లు, ఒక సిక్సర్) మోయిన్ అలీ (20 బంతుల్లో 43 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (30) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ (0/45) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీసేన 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 70 రిటైర్డ్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (24 బంతుల్లో 51: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో ఆకట్టుకోగా రిషబ్ పంత్ (14 బంతుల్లో 29 నాటౌట్), ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, లివింగ్ స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.