మనోజ్‌చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని చెప్పారు.

యూఎస్‌లో ఫిల్మ్‌మేకింగ్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశా. అందరూ అనుకున్నట్లు ఇది హారర్ చిత్రం కాదు. కాకపోతే దీంట్లో ఓ చిన్న సూపర్ నేచురల్ అంశం ఉంది.గ్రామదేవతల నేపథ్యంలో నడిచే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాలో ఓ జాతర సీన్ పుష్ప-2 లోని సన్నివేశం తరహాలో పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని అన్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో ఒకరు, ఈ సినిమా ట్రైలర్ పెద్ద వంశీ సినిమాల తరహాలో ఉందని చెప్పారని, దానిని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నానని, యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలనుకుంటున్నానని ప్రవీణ పరుచూరి చెప్పారు.















