అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సీనియర్ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మతార్ హతమయ్యాడని యూఎస్ ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ తెలిపారు. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిరచారు. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్సోప్ట్పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగేనీ ఈ జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)