కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. ఆమె వయసు 54 ఏళ్లు. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ స్థానంలో అనిత తాజా బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలో ప్రముఖ న్యాయవాది అయిన 54 ఏండ్ల అనితా ఆనంద్.. గత నెలలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓక్విల్లే నుంచి 46 శాతం ఓట్లతో గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆమె వ్యాక్సిన్ మినిస్టర్‌గా పని చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. దీంతో లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆర్మీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అనితను రక్షణ మంత్రిగా ఎంపిక చేశారు.