బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ పుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికీ రాజీనామా చేశారు. ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నారు. ఈ జట్టుకు గుంగూలీ డైరెక్టర్ మాత్రమే కాదు షేర్ హోల్డర్ కూడా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)