రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు అడ్డంకిగా మారే కాట్సా చట్టాన్ని భారత్‌పై ప్రయోగించవద్దంటూ ఇద్దరు అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా లేఖ రాశారు. రష్యా రూపొందించిన ఎస్`400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో భారత్‌కు ఇబ్బందులు కలుగ చేయవద్దని సూచించారు. ఈ చట్టం నుంచి భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డెమాక్రెటిక్ పార్టీకి చెందిన మార్క్ వార్నర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కోర్నిన్ లేఖ రాశారు. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్ చట్టం. దీని ప్రకారం రష్యాతో పాటు అమెరికా తనకు విరోధిగా భావిస్తున్న దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ కొనుగోలు చేపట్టడం నిషిద్ధం. దీన్ని అతిక్రమించిన దేశాలపై కూడా అమెరికా తన ఆంక్షల కొరడా రaళిపిస్తుంది. అమెరికాకు భారత్ ముఖ్య భాగస్వామి అన్న విషయాన్ని వార్నర్, కోర్నిన్ తమ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు.