హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆసీ ఆదేశించింది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. హుజురాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈ నెల 30 హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్. మొత్తం ఓటర్లు 2,36,283. పురుష ఓటర్లు 1,18,720, మహిళా ఓటర్లు 1,17,563. మొత్తం 5 మండలాల్లో జరగనున్న పోలింగ్. మొత్తం 306 కేంద్రాలు, 106 గ్రామ పంచాయతీల్లో జరగనున్న పోలింగ్. నవంబర్ 2న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. బద్వేల్ ఉప ఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు. మొత్తం ఓటర్లు 2,15,292. పురుషు ఓటర్లు 1,07,915. మహిళ ఓటర్లు 1,07,355. నియోజకవర్గంలో 22 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలు మోహరింపు జరిగింది.