Namaste NRI

మోదీ బర్త్​డే స్పెషల్​.. బయోపిక్​ పోస్టర్​ రిలీజ్​.. టైటిల్ ఇదే

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర వెండితెరకెక్కబోతున్నది. మా వందే  పేరుతో రూపొందించనున్న ఈ చిత్రానికి క్రాంతికుమార్‌ సి.హెచ్‌. దర్శకత్వం వహిస్తారు. నరేంద్ర మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ పోషిస్తున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించబోతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్‌ ఇండియాతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కించబోతున్నామని నిర్మాత వీర్‌ రెడ్డి ఎం. తెలిపారు.

ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితంలోని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నామని దర్శకుడు క్రాంతికుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌ కుమార్‌, సంగీతం: రవి బస్రూర్‌, నిర్మాణ సంస్థ: సిల్వర్‌ కాస్ట్‌ క్రియేషన్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: సాబు సిరిల్‌, రచన-దర్శకత్వం: క్రాంతికుమార్‌ సి.హెచ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events