
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో యాంటీ ఫాసిస్ట్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న యాంటిఫా గ్రూపును, కీలక ఉగ్రవాద సంస్థగా ప్రకటించనున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఉటా వాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంటిఫా గ్రూపును అణిచివేసేందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తానని గతంలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే కిర్క్ హత్యతో మళ్లీ అంశాన్ని లేవనెత్తినట్లు అయ్యింది. అదో జబ్బుపడిన, ప్రమాదకర, రాడికల్ వామపక్ష విధ్వంసం అన్నారు. యాంటిఫా ఉద్యమాలకు నిధులు ఇస్తున్న వారిని దర్యాప్తు చేపట్టనున్నట్లు ట్రంప్ చెప్పారు.
















