ప్రపంచంలో పలు యుద్ధాలు ఆపాననీ, ఈ సారి నోబెల్ శాంతి బహుమతి తననే వరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది శాంతి బహుమతి వెనిజులాకు చెందిన ప్రతిపక్ష కార్యకర్త, ఎంపీ మరియా కొరీనా మచోడాకు దక్కింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచోడా చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నాని నోబెల్ కమిటీ తెలిపింది.

ఈ సారి ఈ అత్యున్న పురస్కారాన్ని ఆశించిన వారిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉండటమే. ఎనిమిది యుద్ధాలను నివారించిన తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ ఇటీవలి కాలంలో అనేక ప్రకటనలు చేశారు. దానిపై ఎన్నో ఆశలూ పెట్టుకున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ రష్యా, ఇజ్రాయిల్, పాక్ సహా పలు దేశాలతో నామినేట్ కూడా చేయించుకున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోతే అమెరికాకే అవమానమని వ్యాఖ్యలూ చేశారు.
















