మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. రవితేజ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి స్పందన రాగా ఇపుడు మేకర్స్ సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వం జోరు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్లో రవితేజ ఎడారిలో నడిచి వెళ్తూ కనిపించారు. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డిరపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కూర్పు అమర్ రెడ్డి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)